అటు రేటింగులకు.. ఇటు బ్రేకింగులకు కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్న ABN ఆంధ్రజ్యోతిలో వెంకటకృష్ణ ఎంట్రీ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా కాలంగా ఆ ఛానెల్ అవుట్‌పుట్ బాధ్యతలని కామేశ్ ఒక్కరే చూస్తున్నప్పటికీ.. ఇప్పుడు అదనంగా మరో అవుట్‌పుట్ ఎడిటర్‌గా దేశరాజు శ్రీనివాస్ (డీఎస్)ని MahaaNews నుంచి తీసుకురావడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరిలో ఒకరు ఉదయం, మరొకరు మధ్యాహ్నం షిప్ట్ బాధ్యతలు చూసుకునేలా యాజమాన్యం డైరెక్ట్ చేసినప్పటికీ.. కామేశ్‌కి పొమ్మనలేక పొగబెట్టడం కోసమే డీఎస్‌ని తెచ్చారేమోనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి కొద్దినెలల క్రితమే కామేశ్ ABN ఆంధ్రజ్యోతిని వీడతారని ప్రచారం జరిగింది. అందుకు కారణం కూడా ఉంది. AP 24X7 నుంచి బయటకు వచ్చిన వెంకటకృష్ణ ఇటీవలే ABN ఆంధ్రజ్యోతిలో చేరారు. అయితే కామేశ్, వెంకటకృష్ణ గతంలో HMTVలో పనిచేసిన సమయంలో కొన్ని బేధాభిప్రాయాలు వచ్చాయన్న ప్రచారం ఉంది. దీంతో వెంకట కృష్ణ మళ్లీ తాను పనిచేస్తున్న ABN ఆంధ్రజ్యోతిలోకి రావడం నచ్చని కామేశ్.. కొద్దిరోజుల పాటు ఆఫీస్‌కి వెళ్లలేదట. కామేశ్ దాదాపు టీవీ 5లో చేరినట్టేనన్న మాట కూడా వినిపించింది. కాని చివరి నిమిషంలో ఛానెల్ ఎండీ రాధాకృష్ణ సయోధ్య కుదర్చడంతో కామేశ్ మళ్లీ ABN ఆంధ్రజ్యోతి అవుట్‌పుట్‌గా కొనసాగుతున్నారు. వీరిమధ్య సమన్వయం కోసం సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్‌ని కూడా చానెల్‌లోకి తీసుకొచ్చారు. కానీ ఆలపాటి కొద్దిరోజులకే ABN ఆంధ్రజ్యోతికి గుడ్‌బై చెప్పారు.
ఇప్పుడు మరో అవుట్‌పుట్ ఎడిటర్‌గా డీఎస్‌ని తీసుకొచ్చారు. పాత ఉద్యోగులు గుసగులాడుతున్నట్టు డీఎస్ ఎంట్రీ నిజంగానే కామేశ్‌కి చెక్ పెట్టడానికా.. లేక ఇద్దరూ కలిసి చానెల్ రేటింగులను పరుగులు పెట్టించడానికా అన్నది త్వరలోనే తెలియనుంది. అన్నట్టు ఈ డీఎస్ గతంలోనే ABN ఆంధ్రజ్యోతిలో పనిచేశారు.
0 Comments